Sonal Chauhan: ‘‘మోదీజీ కాపాడండి’’.. దుబాయ్ లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్ విజ్ఞప్తి

Sonal Chauhan requests Modi for help after getting stuck in Dubai
  • విమానాలు రద్దు కావడంతో చిక్కుకుపోయానని సోషల్ మీడియాలో పోస్ట్
  • హాలిడే ట్రిప్‌కు వెళ్లి యుద్ధం మధ్యలో అల్లాడుతున్న వైనం
  • సురక్షితంగా భారత్ చేర్చాలని ప్రధాని మోదీకి నటి విజ్ఞప్తి
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలల ప్రభావం సెలబ్రిటీలపై కూడా పడింది. హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ వెళ్లిన నటి సోనాల్ చౌహాన్.. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. విమానాశ్రయాలు మూతపడటంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ‘‘గౌరవనీయ ప్రధాని మోదీ జీ.. ప్రస్తుత యుద్ధ సంక్షోభం కారణంగా నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమానాలు రద్దయ్యాయి, ఇంటికి రావడానికి వేరే దారి లేదు. దయచేసి నేను సురక్షితంగా భారత్ చేరుకోవడానికి సహకరించండి’’ అని ఆమె తన పోస్టులో కోరారు.

కాగా, ఇప్పటికే భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు అస్తవ్యస్తం కావడంతో అక్కడ ఉన్న భారతీయులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sonal Chauhan
Sonal Chauhan Dubai
Dubai stranded
Narendra Modi
PV Sindhu
Flight cancellations
Middle East crisis
Bollywood actress
Tollywood actress
India travel

More Telugu News