టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్‌ను తప్పిస్తారనే ప్రచారం.. స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

Suryakumar Yadav removal after T20 World Cup reaction from Michael Vaughan
టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌ను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. సూర్యకుమార్ విషయంలో అలాంటి ప్రచారం జరుగుతోందని, అదే నిజమైతే ఆ నిర్ణయం తీసుకోవద్దని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమని, ఇలాంటి జీనియస్ ఆటగాడిని కొనసాగించాలని అన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత అతడిని కాదని మరొక సారథిని తీసుకురావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అన్నాడు. తిలక్ వర్మ తన స్ట్రైక్ రేటును పెంచుకోవాలని చూస్తుంటాడని మైకేల్ వాన్ అన్నాడు. కొన్నిసార్లు బ్యాటింగ్ లైనప్‌ను బట్టి స్ట్రైక్ రేటు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు.

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్‌పై కూడా స్పందించాడు. ఈ ప్రపంచ కప్ అతడికి చివరి టీ20 టోర్నీ అని పేర్కొన్నాడు. బాబర్ అజామ్‌ను తాను పొట్టి క్రికెట్ ప్లేయర్ అనుకోవడం లేదని తెలిపాడు. అతడికి వన్డే ఫార్మాట్ చక్కగా సరిపోతుందని వ్యాఖ్యానించాడు. టెస్టుల్లో కూడా స్పెషలిస్టుగా మారవచ్చని అభిప్రాయపడ్డాడు.
Go Back to Shorts
Suryakumar Yadav
T20 World Cup
Michael Vaughan
Tilak Varma
Babar Azam
England
Pakistan

More Telugu News