Mohammad Ameer: హిమాయత్‌సాగర్ లో యువకుడి దారుణ హత్య

Mohammad Ameer brutally murdered near Himayat Sagar Hyderabad
  • మృతుడు టోలిచౌకికి చెందిన వ్యాపారి మహ్మద్ అమీర్‌గా గుర్తింపు
  • హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని కుటుంబం ఆరోపణ
  • పాత కక్షల కోణంలో రాజేంద్రనగర్ పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ నగరంలో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో నిన్న రాత్రి పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు.

మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్ అమీర్‌గా పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారమే అమీర్‌ను హత్య చేసి, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు లేదా ఇతర కారణాల వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
Mohammad Ameer
Hyderabad murder
Himayat Sagar
Tolichowki
Rajendranagar police
crime news
Telangana crime
business man murder

More Telugu News