ఇన్స్టా అకౌంట్ బ్యాన్ కావడంపై యూట్యూబర్ అన్వేష్ రియాక్షన్

Anvesh YouTuber Bold Reaction on Instagram Account Ban
షార్ట్స్‌లో చూడండి

ప్రపంచ యాత్రల వీడియోలతో ఎంతో మంది ఫాలోయర్లను సంపాదించుకున్న తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడంపై బోల్డ్ రియాక్షన్ ఇచ్చాడు. మరో ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి వీడియో పోస్ట్ చేసిన అతను... “ఇన్‌స్టా అకౌంట్ పోయినందుకు నాకేం బాధ లేదు. రూపాయి రాని ఇన్‌స్టా ఉంటే ఏంటి పోతే ఏంటి? ఇన్‌స్టా ఛానల్స్ prapranchayatrikudu, naa_anveshana5... యూట్యూబ్ ఛానల్స్ naa anveshana, prapancha yatrikudu నాకు రెండు చేతులు, రెండు కాళ్లు లాంటివి. ఫేస్ బుక్ అకౌంట్ నా బాడీతో సమానం. ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా వీడియోలు చేయడం ఆపను. అన్నీ బ్యాన్ చేసినా.. వాటన్నింటినీ నడిపించే నా మైండ్ ని ఏం చేయలేరు. 


ఒక చేతిని విరగ్గొడితే ఇంకో చెయ్యి, రెండు కాళ్లతో ముందుకు వెళతా. రెండో చెయ్యి పోతే రెండు కాళ్లతో వెళతా. కాళ్లు కూడా తీసేస్తే బాడీతో పాకుకుంటూ వెళతా. దాన్ని కూడా తీసేస్తే నా బుర్రే ఆయుధంగా పనిచేస్తుంది. ఎవరెన్ని చేసినా.. నేను చేయాల్సింది చేస్తా. 


ఇన్ స్టాలో నేను ఎలాంటి ప్రమోషన్లు, లింకులు ఇవ్వలేదు. అయినా నా అకౌంట్ బ్యాన్ చేయించారు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా. యూట్యూబ్ నుంచే గత నెల రూ.8 లక్షల ఆదాయం వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.


ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు నెట్టింట తీవ్రదుమారానికి దారితీశాయి. ఇండియా గురించి ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసుల సూచన మేరకు ఇన్స్టా యాజమాన్యం ఆయన అకౌంట్ ను బ్యాన్ చేసింది.

Go Back to Shorts
Anvesh
Naa Anveshana
YouTuber Anvesh
Instagram ban
Prapancha Yatrikudu
Travel vlogs
YouTube income
CCS police
Controversial comments
India

More Telugu News