రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

Rajya Sabha Elections Schedule Released Elections for Two Seats in Telangana
  • 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల
  • మార్చి 16న ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది.

మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్‌గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల, మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు, మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
Advertisement
Rajya Sabha Elections
Telangana
Election Commission
Rajya Sabha
Suresh Reddy
Abhishek Singhvi

More Telugu News