Subbaraju: లేటు వయసులో పెళ్లి చేసుకోవడంపై నటుడు సుబ్బరాజు స్పందన

Subbaraju responds to late marriage
షార్ట్స్‌లో చూడండి
క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో నటుడు సుబ్బరాజు తనదైన ముద్ర వేశారు. 'బాహుబలి 2' ద్వారా దేశ వ్యాప్తంగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా బిజీగా ఉన్న సుబ్బరాజు... చాలా లేటుగా పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో సడెన్ గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పెళ్లిళ్లు లేటుగా ఎందుకు చేసుకుంటున్నారు? విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? అనే విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చాలామంది ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనో, లేదా వయసు పెరిగిపోతోందనో పెళ్లి చేసుకుంటారని సుబ్బరాజు అన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నీకు ఏదో వస్తుందని చేసుకునేది పెళ్లి కాదు... నీ భాగస్వామికి నీవు ఏమి ఇవ్వగలవనే దానిపై నీ పెళ్లి ఆధారపడి ఉండాలని అన్నారు. భాగస్వామిపై పెట్టుకునే భారీ అంచనాలే పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణమని చెప్పారు. తన భార్య అలా ఉండాలని, తన భర్త అలా ఉండాలని ఊహించుకుంటారని, పెళ్లయిన తర్వాత వాస్తవం అలా లేకపోతే మనస్పర్థలు మొదలవుతాయని అన్నారు. తన భార్యకు తన సర్వస్వం ఇవ్వగలను అని నమ్మకం వచ్చిన తర్వాతే తాను పెళ్లి చేసుకున్నానని చెప్పారు.
Go Back to Shorts
Subbaraju
Subbaraju marriage
Telugu actor
Late marriage
Divorce reasons
Bahubali 2 actor
Relationship advice
Marriage expectations
Tollywood actor
Subbaraju interview

More Telugu News