వైవీ సుబ్బారెడ్డికి సీఎం భద్రత కల్పించాలి: మంత్రి సవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైవీ సుబ్బారెడ్డికి సీఎం భద్రత కల్పించాలి: మంత్రి సవిత

Minister Savitha demands CM security for YV Subba Reddy
  • తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు జగన్ చిన్నాన్న సుబ్బారెడ్డే అంగీకరించారన్న మంత్రి సవిత
  • సుబ్బారెడ్డి ప్రాణాలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిక
  • సుబ్బారెడ్డికి భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని వినతి
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీఎం భద్రత కల్పించాలంటూ మంత్రి ఎస్ సవిత సంచలన కామెంట్స్ చేశారు. నిన్న టీడీపీ కడప పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు జగన్ చిన్నాన్న సుబ్బారెడ్డే స్వయంగా అంగీకరించారని, ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లేదంటే సుబ్బారెడ్డి ప్రాణాలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, చైతన్య రెడ్డి, మాధవి, పుట్టా సుధాకర్ యాదవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, బీటెక్ రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు.  
Advertisement
YV Subba Reddy
Minister Savitha
TTD
TDP
Andhra Pradesh Politics
Tirumala Laddu
Adulterated Ghee
Security Threat
Kadapa
Jagan Mohan Reddy

More Telugu News