పాకిస్థాన్లో ఆర్థిక ఇబ్బందులు.. మ్యాన్ హోల్ మూతలు ఎత్తుకెళితే 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామన్న ప్రభుత్వం
- మ్యాన్ హోల్ మూతలు దొంగిలించే స్థాయికి పాకిస్థాన్లో ఆర్థిక అనిశ్చితి
- ఉదయం మూతలు వేస్తే రాత్రి కల్లా మాయమవుతున్నాయన్న పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
- మ్యాన్ హోల్ మూతలు దొంగిలించవద్దని పాకిస్థాన్లో ముఖ్యమంత్రి విజ్ఞప్తి
మ్యాన్ హోల్స్ మూతలు ఎత్తుకుపోవద్దని విజ్ఞప్తి చేస్తూ మరియం నవాజ్ వీడియోను విడుదల చేశారు. ఉదయం మ్యాన్ హోల్స్ మూతలు వేస్తున్నామని, రాత్రికల్లా అవి మాయమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. వాటిని దొంగిలించవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. దొంగిలించిన మ్యాన్ హోల్స్ మూతలు అమ్మడం లేదా కొనడం చేస్తే ఏడాది నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మ్యాన్ హోల్లో పడి ఎవరైనా మరణిస్తే బాధ్యులకు పదేళ్ళ జైలు శిక్ష, 50 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
పాకిస్థాన్లో మ్యాన్ హోల్స్ మూతలు దాదాపు 30 కిలోలు ఉంటాయి. వాటిని ఎత్తుకెళ్లి స్క్రాప్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మూత లేకపోవడం వల్ల లాహోర్లో ఒక మ్యాన్ హోల్లో పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.