ఉన్నావ్ అత్యాచారం ఘటన.. కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
- 10 సంవత్సరాల జైలు శిక్షను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టుకు సెంగర్
- సెంగర్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
- శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు కారణాలు లేవన్న న్యాయమూర్తి
కాగా, ఉన్నావ్ అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసు శాఖను ఆదేశించింది.