Abhimanyu Pawar: 3 కి.మీ. సాష్టాంగ ప్రమాణాలతో మొక్కు తీర్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే
- ఏళ్ల తరబడి మూతబడిన చక్కెర కర్మాగారం
- ఫ్యాక్టరీ తెరుచుకుంటే సాష్టాంగ ప్రమాణాలు చేస్తానని మొక్కుకున్న ఎమ్మెల్యే
- చక్కెర కర్మాగారం పునఃప్రారంభమైనందుకు మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ శనివారం స్థానిక చక్కెర కర్మాగారం నుండి అక్కడి నీలకంఠేశ్వర్ ఆలయం వరకు మూడు కిలోమీటర్ల మేర సాష్టాంగ ప్రణామాలు చేసి మొక్కు తీర్చుకున్నారు. స్థానికంగా చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి తన కోరిక నెరవేరడంతో ఆయన మొక్కు తీర్చుకున్నారు.
లాతూర్ జిల్లాలోని కిల్లారి గ్రామంలో ఏళ్ల తరబడి రైతుల ఆధ్వర్యంలోని ఒక చక్కెర కర్మాగారం మూతబడి ఉంది. యంత్రాలు అరిగిపోయి, మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆగస్టులో ఆయన నీలకంఠేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. చక్కెర పరిశ్రమ మళ్లీ అందుబాటులోకి వస్తే సాష్టాంగ ప్రణామాలు చేస్తానని మొక్కుకున్నారు.
ఇటీవల ఈ కర్మాగారం ప్రారంభమవడంతో, ఆయన కర్మాగారం నుంచి ఆలయం వరకు సాష్టాంగ ప్రణామాలతో వచ్చారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన తొలి చక్కెర సంచిని స్వామి వారికి సమర్పించారు. ఆయన వెంట భార్య, కుమారుడు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. కాగా, ఈ కర్మాగారాన్ని 'శ్రీ నీలకంఠేశ్వర్ షెట్కారి సహకారి శఖర్ కార్ఖా' పేరుతో తిరిగి ప్రారంభించారు.