ఇండిగో సర్వీసుల అంతరాయం.. కేంద్ర ప్రభుత్వానికి నారాయణ కీలక సూచన
- ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారన్న సీపీఐ నేత నారాయణ
- ఇండిగోను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని సూచన
- ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం చంపేస్తోందని విమర్శ
ఈ సర్వీసులలో అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అందుకే ఇండిగోను కేంద్రం స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, అందుకే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ విమానయానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.