నేడు కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ
- కేంద్ర మంత్రులతో భేటీ కోసం ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రులు లోకేశ్, అనిత
- 'మొంథా' తుపాను నష్టంపై నివేదిక అందజేయనున్న మంత్రులు
- హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం
- వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్‌తోనూ భేటీ
తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను వారు కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు. రాష్ట్రానికి అవసరమైన సహాయంపై చర్చించనున్నారు. ఈ సమావేశం కోసమే మంత్రులు లోకేశ్, అనిత నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి టీడీపీ ఎంపీలు సాదరంగా స్వాగతం పలికారు. తుపాను నష్టం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు కోరడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం.