నలభైలకే నడుము వంగుతోంది.. కండరాలను కరిగించే 'సార్కోపీనియా' పై హెచ్చరిక!
- నలభై ఏళ్లకే దాడి చేస్తున్న సార్కోపీనియా వ్యాధి
- గంటల తరబడి కూర్చోవడం, పోషకాహార లోపమే కారణం
- అలసట, నడక మందగించడం, బ్యాలెన్స్ తప్పడం సంకేతాలు
- ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్-డి తీసుకోవడం తప్పనిసరి
- వెయిట్ ట్రైనింగ్, ప్రశాంత నిద్రతో నివారణ సాధ్యం
గతంలో అరవై ఏళ్లు దాటాక కనిపించే శారీరక బలహీనతలు, అలసట ఇప్పుడు నలభై ఏళ్లకే నగరవాసులను చుట్టుముడుతున్నాయి. వృద్ధాప్యం అనేది ఒకప్పుడు కాలక్రమేణా వచ్చే మార్పు కాగా.. నేడు అది చిన్న వయస్సులోనే శరీరంలోకి ప్రవేశిస్తోంది. దీనికి నిద్రలేమి, అధిక పని ఒత్తిడి మాత్రమే కారణం అనుకుంటే పొరపాటేనని, మనకు తెలియకుండానే శరీరాన్ని కరిగించే 'సార్కోపీనియా' అనే తీవ్రమైన కండరాల క్షీణత వ్యాధి దీనికి ప్రధాన కారణమని ఇండియన్ జెరియాట్రిక్ సొసైటీ స్పష్టం చేసింది. కండరాల పరిమాణం తగ్గడం, బలం నశించి శారీరక సామర్థ్యం దెబ్బతినడమే ఈ వ్యాధి ముఖ్యాంశం.
రోజంతా సీట్లలోనే కూర్చుని పనిచేసే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు, అసలు వ్యాయామమే లేకపోవడం, శరీరానికి సరిపడా పోషకాలు అందకపోవడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధి బారిన పడినవారిలో నడక వేగం తగ్గడం, కొద్దిపాటి మెట్లు ఎక్కడానికి కూడా తీవ్రంగా శ్రమపడాల్సి రావడం, బ్యాలెన్స్ తప్పి కిందపడిపోవడం వంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోని మధుమేహ బాధితుల్లో ఈ కండరాల క్షీణత మరింత వేగంగా జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు బరువు తగ్గాలనే తొందరలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా చేసే తీవ్రమైన డైటింగ్‌లు, ఉపవాసాలు, బరువు తగ్గే మాత్రలు తీసుకోవడం వల్ల కొవ్వుతో పాటు శరీరంలోని ముఖ్యమైన కండరాలు కూడా కరిగిపోతున్నాయి.
ఈ తీవ్రమైన సమస్య బారిన పడకుండా ఉండాలంటే మన ఆహార అలవాట్లలో, జీవనశైలిలో తక్షణ మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో క్రమం తప్పకుండా పాలు, గుడ్లు, నాన్‌వెజ్, పప్పుధాన్యాలు, సోయా వంటి ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పదార్థాలను భాగం చేసుకోవాలి. కేవలం సాధారణ వాకింగ్ మాత్రమే సరిపోదని, కండరాలు బలోపేతం కావడానికి వెయిట్ ట్రైనింగ్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు వారానికి కనీసం 2-3 రోజులు చేయాలి. వీటికి తోడు ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నిద్ర, విటమిన్-డి, బి12 సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా ఈ సార్కోపీనియాను ప్రాథమిక దశలోనే నిరోధించవచ్చు.