Narendra Modi: బీహార్ ఎన్నికల ఫలితాలపై మోదీ, నితీశ్, జైశంకర్ ఏమన్నారంటే...!
- ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారన్న మోదీ
- వికసిత్ భారత్‌పై విశ్వాసం పెట్టుకున్నారన్న అమిత్ షా
- కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ప్రజలు గెలిపించారన్న జైశంకర్
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదితరులు 'ఎక్స్' వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి గెలిపించాయని అన్నారు. బీహార్ అభివృద్ధికి నూతన సంకల్పంతో పని చేసేందుకు ఈ చారిత్రక విజయం మరింత శక్తినిస్తుందని అన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ప్రధాని మోదీ తన సందేశాన్ని పంచుకున్నారు. "సుపరిపాలన విజయం సాధించింది. అభివృద్ధి విజయం సాధించింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి విజయం సాధించింది. సామాజిక న్యాయం విజయం సాధించింది" అని ఆయన పేర్కొన్నారు.
"రాబోయే కాలంలో బీహార్ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేస్తాం. రాష్ట్ర మౌలిక సదుపాయాలకు, సంస్కృతికి కొత్త గుర్తింపును అందిస్తాం. ఇక్కడి యువ శక్తి, మహిళా శక్తికి ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నాను" అని మోదీ తెలిపారు.
ఎన్డీయేకు ఈ చారిత్రక విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు, ప్రజలకు సేవ చేయడానికి, బీహార్ కోసం కొత్త సంకల్పంతో పనిచేయడానికి తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు.
ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. "ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జీకి, ఎన్డీయే కుటుంబ సహచరులైన చిరాగ్ పాశ్వాన్ జీ, జితన్ రామ్ మాంఝీ జీ, ఉపేంద్ర కుష్వాహా జీలకు ఈ అద్భుత విజయానికి నా హృదయపూర్వక అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, ప్రతిపక్షాలు ప్రచారం చేసిన ప్రతీ అబద్ధాన్ని గట్టిగా తిప్పికొడుతూ, తమ అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని మోదీ అన్నారు. ప్రతి కార్యకర్తను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇక, వికసిత్ భారత్‌పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమిదని అమిత్ షా పేర్కొన్నారు. జంగల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ వేషంలో వచ్చినా వారికి దోచుకునే అవకాశం లభించదని పేర్కొన్నారు.
బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మోదీ, నితీశ్ తదితరులకు అభినందనలు తెలియజేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలోనే బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు.
మోదీ, నితీశ్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని జేపీ నడ్డా పేర్కొన్నారు. జంగల్ రాజ్, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సుపరిపాలన, సుస్థిరత, అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పేర్కొన్నారు. తమకు అపూర్వ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి మద్దతుతో బీహార్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.