ఓటీటీలో తమిళ క్రైమ్ థ్రిల్లర్ .. ఊపిరి బిగబట్టాల్సిందే!
- తమిళంలో రూపొందిన 'బ్లాక్ మెయిల్'
- ప్రధాన పాత్రల్లో జీవీ ప్రకాశ్, బిందుమాధవి
- సన్ నెక్స్ట్ చేతికి ఓటీటీ హక్కులు
- ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్
శ్రీరామ్ .. బింధుమాధవి .. తేజు అశ్విని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను 'సన్ నెక్స్ట్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. థియేటర్స్ దగ్గర ఫరవాలేదని అనిపించుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో మణి అనే పాత్రలో జీవీ ప్రకాశ్ కుమార్ కనిపించనున్నాడు. మణి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ ఫార్మా సంస్థలో పనిచేసే రేఖ ఇబ్బందుల్లో పడుతుంది. అలాగే అశోక్ అనే వ్యక్తి కూతురు కిడ్నాప్ చేయబడుతుంది. అలాగే అర్చన అనే యువతి కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్ కి గురవుతూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతుంటారు. వాళ్ల జీవితాలలో దాగిన రహస్యం ఏమిటి? వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు? అనేది కథ.