తిరుపతి సదస్సులో ఎన్టీఆర్ ను గుర్తుచేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
- మహిళా సాధికారతకు ఆయన ఎంతో కృషి చేశారన్న హరివంశ్ సింగ్
- అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు ప్రాధాన్యం
- ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబులపై ప్రశంసల జల్లు
అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని హరివంశ్ వివరించారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్‌గా తీర్చదిద్దారంటూ సీఎం చంద్రబాబును హరివంశ్ ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీసిటీలో సగానికిపైగా మహిళలు ఉద్యోగాలు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణనను ఏపీలో చేపట్టారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తెలిపారు.