దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’.. ఈసీ
- రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సీఈసీ కీలక భేటీ
- ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా సవరణ
- ఈసీ చర్యను సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో జరగనున్న సమావేశంలో ఈసీ సీనియర్ అధికారులు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. బీహార్ లో ఈ విధానాన్ని అమలు చేసిన తీరును ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించనున్నారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.