ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం
- సీపీ రాధాకృష్ణన్‌కు పోలైన 452 ఓట్లు
- జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పోలైన 300 ఓట్లు
- 15 ఓట్లు చెల్లనివిగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు.
మొత్తమ్మీద 152 ఓట్ల మెజారిటీతో సీపీ రాధాకృష్ణన్ విజయం అందుకున్నారు.