Boney Kapoor: భర్త అయిన నన్ను కూడా శ్రీదేవి తన గదిలోకి అనుమతించలేదు: బోనీ కపూర్
- శ్రీదేవి డెడికేషన్ గురించి బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పాత్ర నుంచి దృష్టి మరలకూడదని తనను హోటల్ గదిలోకి రానివ్వలేదని వెల్లడి
- రెహమాన్ కోసం 50 నుంచి 70 లక్షలు వదులుకున్నారన్న బోనీ
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవారో ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆమె చివరి చిత్రం ‘మామ్’ కోసం శ్రీదేవి తన పారితోషికం నుంచి ఏకంగా రూ. 50 నుంచి 70 లక్షల వరకు వదులుకున్నారని ఆయన తాజాగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే, ‘మామ్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాలని శ్రీదేవి బలంగా కోరుకున్నారు. అయితే, ఆయన పారితోషికం బడ్జెట్‌కు మించి ఉండటంతో నిర్మాతగా బోనీ కపూర్ కాస్త వెనకాడారు. కానీ, ఆ ప్రాజెక్టుకు రెహమాన్ సంగీతమే ప్రాణం పోస్తుందని నమ్మిన శ్రీదేవి, తన ఫీజు నుంచే ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసి, రెహమాన్‌ను తీసుకునేలా చేశారని బోనీ తెలిపారు.
పాత్రలో లీనమైతే శ్రీదేవి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయేదని బోనీ కపూర్ గుర్తుచేసుకున్నారు. ‘మామ్’ షూటింగ్ కోసం జార్జియా వెళ్లినప్పుడు, తాను బస చేస్తున్న హోటల్ గదిలోకి భర్త అయిన తనను కూడా రానివ్వలేదని చెప్పారు. పాత్ర నుంచి ఏమాత్రం దృష్టి మరలకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసిందని వివరించారు.
కేవలం నటనలోనే కాదు, భాష విషయంలోనూ ఆమె ఎంతో శ్రద్ధ చూపించేవారని బోనీ తెలిపారు. తెలుగు, మలయాళంలో తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ముఖ్యంగా, మలయాళ డబ్బింగ్ సమయంలో తన ఉచ్ఛారణ, లిప్ సింక్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఒక డబ్బింగ్ ఆర్టిస్టును పక్కనే కూర్చోబెట్టుకుని సరిచూసుకునేవారని అన్నారు. హిందీలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఒక టీచర్‌తో డబ్బింగ్ థియేటర్లోనే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని బోనీ కపూర్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.