Rahul Gandhi: త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తాం... మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు: రాహుల్ గాంధీ
- 'ఓటర్ అధికార్ యాత్ర' ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
- యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్న రాహుల్ గాంధీ
- ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామన్న రాహుల్ గాంధీ
ఓట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.
'ఓటర్ అధికార్ యాత్ర' ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తామంటే బీజేపీని అనుమతించేది లేదని అన్నారు. అందుకే ఈ యాత్రను నిర్వహించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామని వెల్లడించారు. ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో త్వరలో హైడ్రోజన్ బాంబును పేల్చుతామని ఆయన అన్నారు.