విద్యార్థుల స్థానికతపై క్లారిటీ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- విద్యార్థుల స్థానికతపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
- వరుసగా నాలుగేళ్లు చదివితేనే లోకల్ స్టేటస్
- ఇంటర్మీడియట్ చదువు కూడా తప్పనిసరిగా పరిగణన
- రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఈ నిబంధన
- విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేత
విద్యా, ఉద్యోగాల్లో స్థానికతను ఎలా గుర్తించాలనే అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, ఒక విద్యార్థి ఏపీలో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక హోదా పొందుతారని తేల్చిచెప్పింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు స్థానిక అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించింది.
గతంలో ఇదే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఫుల్‌బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. స్థానికత నిబంధనలను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో ఎలాంటి పసలేదని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది. ఈ తీర్పుతో విద్యార్థుల స్థానికత నిర్ధారణ ప్రక్రియలో స్పష్టత వచ్చినట్లయింది.