నల్గొండ మైనర్ బాలికపై హత్యాచారం కేసు.. నిందితుడికి ఉరిశిక్ష వేసిన కోర్టు!
- 2013లో 12 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు
- అఘాయిత్యం అనంతరం బాలికను చంపి, మృతదేహాన్ని కాలువలో పడేసిన వైనం
- నిందితుడిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు
- గత పదేళ్లుగా నల్గొండ కోర్టులో వాదనలు
- ఈ రోజు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తి రోజా రమణి
నిందితుడు ముకర్రంను అరెస్టు చేసిన నల్గొండ వన్‌టౌన్ పోలీసులు అతనిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గత పదేళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఉరిశిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా విధించారు.