వైసీపీ నేత తురకా కిశోర్ విడుదల
- అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న తురకా కిశోర్
- హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికి!
- స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
తురకా కిశోర్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుద్ధా వెంకన్న, బొండా ఉమ ప్రయాణిస్తున్న వాహనంపై తురకా కిశోర్ దాడి చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. తురకా కిశోర్ పై 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ కేసు ఉన్నట్టు తెలుస్తోంది.