అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న ‘మహావతార్ నరసింహ’.. రికార్డు స్థాయి కలెక్షన్స్
- బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ చిత్రం
- స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు లేకుండానే వసూళ్ల వర్షం కురిపిస్తున్న మూవీ
- భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ‘మహావతార్ నరసింహ’
- హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం.. అశ్విన్ కుమార్ దర్శకత్వం
తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థం హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. "అన్ని రికార్డులను అధిగమించి, కేవలం 8 రోజుల్లో రూ. 60.5 కోట్లకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది" అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా, మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.