డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న భారత్... సెమీస్ ఆడకుండానే ఫైనల్లోకి పాక్
- ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ
- రేపు బర్మింగ్ హామ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ సెమీస్
- రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నుంచి వైదొలగిన భారత్
ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. తద్వారా సెమీస్ కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ కు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించాడు.