Rajinikanth: రజనీకాంత్ 'కూలీ' ట్రైలర్ వచ్చేది అప్పుడే!

Rajinikanth Koolie Trailer Release Date Announced
షార్ట్స్‌లో చూడండి
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏమీ ఉండదని, నేరుగా సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

కానీ ఆకస్మాత్తుగా కూలీ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ లాంచింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ సీయూ వరల్డ్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. రజినీకాంత్ లుక్స్, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
Go Back to Shorts
Rajinikanth
Koolie
Lokesh Kanagaraj
Sun Pictures
Kollywood
Nagarjuna
Amir Khan
Upendra
Koolie trailer
Indian cinema

More Telugu News