కులగణన కేవలం డేటా సేకరణ మాత్రమే కాదు.. మెగా హెల్త్ చెకప్: రేవంత్ రెడ్డి
- కులగణనపై 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి కమిటీ
- బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలుకు కులగణన ఉపయోగపడుతుందన్న సీఎం
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి
కమిటీ 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ చేసిన సూచనలపై మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వాటికి గల కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్వహించిన ఈ సర్వే చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.