లార్డ్స్ టెస్టుకు సర్వం సిద్ధం.. లండన్‌లో అడుగుపెట్టిన భారత జట్టు
- ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం లండన్‌కు చేరిన భారత జట్టు
- హీత్రూ విమానాశ్రయంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం
- ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎల్లుండి నుంచి మ్యాచ్ ప్రారంభం
- ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న ఐదు టెస్టుల సిరీస్
ప్రస్తుతం ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో మూడో టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. క్రికెట్ కాశీగా పేరుగాంచిన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎల్లుండి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.