పాక్ నోట మళ్లీ అదే పాట.. మరో ఫేక్ ఫొటోతో ప్రచారం
- ఆదంపూర్ స్థావరంపై దాడి చేశామంటూ పలు ఫొటోలు బయటపెట్టిన పాక్
- ఆధారాలతో తిప్పికొట్టిన సైబర్ నిపుణుడు
- ఎస్-400 ధ్వంసమంటూ పాక్ ప్రచారం.. తన పర్యటనతో చెక్ పెట్టిన మోదీ
ఈ దుష్ప్రచారంతో పాకిస్థాన్ అంతర్జాతీయంగా నవ్వులపాలైంది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాకిస్థాన్ తాజాగా మరో ఫేక్ ఫొటోతో ఆదంపూర్ వైమానిక స్థావరంలోని సుఖోయ్ యుద్ధ విమానాన్ని నాశనం చేశామని చెబుతోంది. అయితే, ప్రముఖ జియో-ఇంటెలిజెన్స్ నిపుణుడు డేమియన్ సైమన్ ఈ వాదనలను ఖండించారు. గత నెలలో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణకు రెండు నెలల ముందు, అంటే మార్చి 2025లో తీసిన శాటిలైట్ చిత్రాన్ని సైమన్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఒక మిగ్-29 విమానం మరమ్మతులో ఉండటం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద కనిపించే నల్లటి మసి సాధారణమైనదేనని ఆయన స్పష్టం చేశారు.