Nagarjuna: 'కుబేర' టీజర్ వచ్చింది... చూశారా?... మాటల్లేవ్.. పాటే!

Nagarjuna Kubera Teaser Released Watch Now
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్‌, నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కుబేర’. విలక్షణ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చిత్ర యూనిట్‌ ఆదివారం ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ పేరిట ఓ ప్రత్యేక టీజర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ టీజర్‌ ద్వారా సినిమాలోని నాలుగు కీలక పాత్రలను పరిచయం చేశారు. విశేషమేమిటంటే, ఈ టీజర్‌లో ఎక్కడా సంభాషణలు లేకపోవడం గమనార్హం. కేవలం ‘నాది నాది.. నాదే ఈ లోకమంతా’ అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యంగా సాగుతూ, పాత్రల స్వభావాలను సూచనప్రాయంగా చూపించారు. ఈ పాట టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని జూన్‌ 20న విడుదల చేయనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
Nagarjuna
Kubera movie
Dhanush
Rashmika Mandanna
Sekhar Kammula
Telugu cinema
Trans of Kubera
Kubera teaser
Telugu movies 2024
Tollywood

More Telugu News