'స్పిరిట్'లో ప్రభాస్ సరసన నటించే కథానాయకి ఖరారు .. ఆమె ఎవరంటే ..?
- స్పిరిట్ మూవీ కథానాయకి పేరును ప్రకటించిన దర్శకుడు సందీప్
- తొమ్మిది భాషల్లో త్రిప్తి డిమ్రీ పేరును ఎక్స్ వేదికగా రాసుకొచ్చిన సందీప్
- దర్శకుడు సందీప్ కు ధన్యవాదాలు తెలిపిన త్రిప్తి
ఈ క్రమంలో ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు బాలీవుడ్ అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఈ మూవీలో కథానాయికగా నటించే అవకాశాన్ని త్రిప్తి డిమ్రీ దక్కించుకుంది. దర్శకుడు సందీప్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
'స్పిరిట్' ప్రాజెక్టులో నటీనటులకు సంబంధించి ప్రభాస్ తర్వాత వచ్చిన అధికారిక ప్రకటన ఇదే. దాదాపు తొమ్మిది భాషల్లో ఈ మూవీని తీర్చిదిద్దనున్నట్లు తాజా ప్రకటనను బట్టి తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. పాన్ వరల్డ్ మూవీగా 'స్పిరిట్'ను తీర్చిదిద్దనున్నట్లు ఈ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
ఈ మూవీకి కథానాయికగా ఎంపికైన త్రిప్తి స్పందిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయానని పేర్కొంది. ఇదివరకే సందీప్ రెడ్డి రూపొందించిన 'యానిమల్' మూవీలో త్రిప్తి కీలక పాత్ర పోషించింది.