రోజూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
- ఒకట్రెండు రోజులు ఉబ్బరం ఉంటే సాధారణమే
- ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు కొన్ని పప్పులు, కూరగాయలతోనూ గ్యాస్ సమస్య
- రోజంతా కడుపు ఉబ్బితే మాత్రం జీర్ణ సమస్యలు ఉండే ఛాన్స్
- బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తపడాల్సిందే!
అప్పుడప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉండడం సాధారణమే. ఎక్కువగా తినడం, కూల్‌డ్రింక్స్ తాగడం, పప్పులు, కొన్ని కూరగాయలు తినడం, వేగంగా భోజనం చేయడం వంటి కారణాలతో జీర్ణవ్యవస్థలో గ్యాస్ పెరిగి కడుపు ఉబ్బినట్లు అనిపించొచ్చు. సాధారణంగా కొంతసేపటికి ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే రోజూ కడుపు ఉబ్బరంగా ఉండటం, రోజంతా పెరుగుతూ పోవడం లేదా రాత్రికి కూడా తగ్గకపోవడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఎప్పుడు కడుపు ఉబ్బరం సాధారణం?
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణమయ్యే సమయంలో సహజంగానే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. పప్పులు, కొన్ని కూరగాయలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు తాత్కాలికంగా కడుపు నిండినట్లు అనిపించొచ్చు.
త్వరగా తినడం, చూయింగ్‌గమ్ నమలడం, స్ట్రా ద్వారా పానీయాలు తాగడం, తింటున్నప్పుడు ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా గాలి ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది.
ఏదైనా ఆహారం తిన్న తర్వాత మాత్రమే ఉబ్బరం వచ్చి.. కొంతసేపటికి తగ్గిపోతే సాధారణంగా ఆందోళన అవసరం ఉండదు.
రోజూ ఉబ్బరంగా ఉంటే..
రోజూ కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా రోజంతా సమస్య ఎక్కువవుతూ పోవడం వెనుక కొన్ని జీర్ణవ్యవస్థ సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), మలబద్ధకం, కొన్ని ఆహార పదార్థాలకు అలర్జీ, ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్, సీలియాక్ వ్యాధి, చిన్న పేగులో బ్యాక్టీరియా అధికంగా పెరగడం, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, కడుపు ఖాళీ కావడం ఆలస్యమవడం, మలబద్ధకం ఉన్నప్పుడు పేగుల్లో మలం ఎక్కువసేపు ఉండటం వల్ల గ్యాస్ పేరుకుపోయి కడుపుపై ఒత్తిడి, ఉబ్బరం పెరగొచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే..
కడుపు ఉబ్బరంతో కారణం లేకుండా బరువు తగ్గడం, మలంలో రక్తం కనిపించడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన లేదా నిరంతర కడుపునొప్పి, జ్వరం, రక్తహీనత, మింగడంలో ఇబ్బంది, నిద్రలో నుంచి మేల్కొలిపే లక్షణాలు, 50 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా మొదలైన నిరంతర ఉబ్బరం, కుటుంబంలో పెద్దపేగు క్యాన్సర్, సీలియాక్ వ్యాధి లేదా ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ చరిత్ర ఉన్నా వైద్య సలహా తీసుకోవాలి.
ఉబ్బరం తగ్గాలంటే ఏం చేయాలి?
భోజనాన్ని నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం ద్వారా గాలి మింగడాన్ని తగ్గించవచ్చు. రోజూ శారీరకంగా చురుగ్గా ఉండటం జీర్ణవ్యవస్థ కదలికలకు సహాయపడుతుంది.
తగినంత నీరు తాగడం, మలబద్ధకం రాకుండా చూసుకోవడం కూడా ఉపయోగకరం. ఫైబర్‌ను ఒక్కసారిగా ఎక్కువగా పెంచకుండా క్రమంగా పెంచాలి. లేకపోతే గ్యాస్, ఉబ్బరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఏ ఆహారం తీసుకున్న తర్వాత ఉబ్బరం ఎక్కువగా వస్తుందో తెలుసుకోవడానికి ఫుడ్ అండ్ సింప్టమ్ డైరీ మెయింటైన్ చేయడం కూడా ఉపయోగపడుతుంది.