తల్లి అయినా తగ్గేదే లే అంటున్న దీపికా పదుకునే
- ప్రభాస్ ‘స్పిరిట్’లో నటించనున్న దీపికా పదుకునే
- ఈ సినిమా కోసం రూ. 20 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు వార్తలు
- ఇదే నిజమైతే అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటిగా రికార్డు
‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా అంగీకరించినట్లు, దీనికిగానూ ఆమె ఏకంగా రూ. 20 కోట్ల పారితోషికం అందుకోనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక నటికి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం దీపికా క్రేజ్‌కు నిదర్శనమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలుపుతున్నారు.