పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల
- అట్టారీ బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్
- ఏప్రిల్ 23న పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పూర్ణం కుమార్ షా
- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో విడుదల ఆలస్యం
పూర్ణం కుమార్ షా (40) పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న ఆయన పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారు. కాగా, అంతకు ఒకరోజు ముందే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కారణంగా పూర్ణం కుమార్ షా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది.