కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పూర్తయింది: గిడుగు రుద్రరాజు
- హామీల విషయంలో చంద్రబాబు విఫలమయ్యారన్న రుద్రరాజు
- వాగ్దానాలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శ
- అమరావతికి 7 వేల ఎకరాల స్థలం సరిపోతుందని వ్యాఖ్య
అమరావతిలో మళ్లీ భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని... దీనికి తాము పూర్తిగా వ్యతిరేకమని రుద్రరాజు తెలిపారు. అమరావతి పేరుతో రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతికి 7 వేల ఎకరాల స్థలం సరిపోతుందని... మరోసారి భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు.