పశ్చిమాసియాలో ముదిరిన పోరు.. ఇరాన్‌పై అమెరికా దాడి, గల్ఫ్‌లో ఇరాన్ ప్రతిదాడి!
- ఇరాన్‌పై 11వ రోజూ అమెరికా దాడులు
- సైనిక కేంద్రాలు, డ్రోన్ స్థావరాలే లక్ష్యం
- గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్
- హర్మూజ్ జలసంధిలో రాకపోకల భద్రతకే చర్యలన్న వైట్ హౌస్
- పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమెరికా, ఇరాన్ మధ్య దాడులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు వరుసగా 11వ రాత్రి కూడా భారీ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ సృష్టిస్తున్న ముప్పును తిప్పికొట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక ఆపరేషన్ కేంద్రాలు, నావికాదళ సామర్థ్యాలు, విమాన హ్యాంగర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు సెంట్‌కామ్ సామాజిక మాధ్యమాల్లో తెలిపింది.
గత మూడు నెలలుగా హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 30కి పైగా వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని, ఇది అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీస్తోందని యూఎస్ పేర్కొంది. తమ దాడులు జరుగుతున్నప్పటికీ హర్మూజ్ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని వివరించింది. కాగా, ఈ దాడులకు నిరసనగా ఇరాన్ సైన్యం కూడా విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరాలు, వాయు రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ విప్లవాత్మక గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.