సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులు అందించేందుకు ముందుకు వచ్చిన ఏఐఎంటీసీ
- పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్
- తమ వంతుగా సైన్యానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఏఐఎంటీసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ
- కార్గిల్ వార్ సమయంలో వెయ్యి ట్రక్కులు సైన్యానికి అప్పగించిన ఏఐటీఎంసీ
ఏఐటీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులను భారత సైన్యానికి అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రిజిస్టర్ చేసిన ట్రక్కులను (వాహనాలను) ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధంగా ఉంచామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని ఆయన అన్నారు.
1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సుమారు వెయ్యి ట్రక్కులను ఆర్మీ కంటోన్మెంట్‌కు అప్పగించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.