యూరీ సెక్టార్‌లో మరోసారి పాకిస్థాన్ కాల్పులు

Pakistans Fresh Firing in Uri Sector
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు ఈ రోజు సాయంత్రం కాల్పులకు తెగబడ్డాయి. పాక్ సైన్యం చిన్నపాటి ఆయుధాలతో, ఫిరంగి గుండ్లతో భారత స్థావరాలపై దాడులు చేసింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా యూరిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

మే 15 వరకు విమానాశ్రయాల మూసివేత

ఉత్తర, పశ్చిమ భారత్‌లోని విమానాశ్రయాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 15వ తేదీ వరకు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో 24 విమానాశ్రయాలను మూసివేశారు.

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సెలవులు రద్దు

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కారణాలు మినహా ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. సెలవుల్లో ఉన్నవారి సెలవులను రద్దు చేస్తూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవుల రద్దు నిర్ణయం కొనసాగుతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Go Back to Shorts
Pakistan
India-Pakistan Border
Uri Sector
Ceasefire Violation
Jammu and Kashmir

More Telugu News