ఆపరేషన్ సిందూర్ మృతులపై పాక్ ప్రకటన
- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’
- భారత్ దాడిలో 31 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారన్న పాక్
- వరుసగా 14వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
భారత్‌లో భద్రతా చర్యలు
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, వాయవ్య భారతదేశంలోని 21 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేస్తున్నట్లు అమృత్‌సర్ ఏడీసీపీ-2 సిరివెన్నెల ప్రకటించారు. "కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ విమానాశ్రయాల నుంచి ఎలాంటి విమాన సర్వీసులు నడపబడవు" అని ఆమె స్పష్టం చేశారు. అలాగే, పాకిస్థాన్ గూఢచార సంస్థలు సైనిక రైళ్ల కదలికలపై సమాచారం సేకరించే అవకాశం ఉందని, అటువంటి రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను హెచ్చరించింది. "మిల్ రైల్ సిబ్బంది (రైల్వేల సైనిక విభాగం) తప్ప, ఇతర అనధికార వ్యక్తులకు రైల్వే అధికారులు అటువంటి సమాచారాన్ని వెల్లడించడం భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది" అని రైల్వే బోర్డు తన ఆదేశాల్లో పేర్కొంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారత వ్యతిరేక దుష్ప్రచారాన్ని అరికట్టాలని, తప్పుడు ఖాతాలను కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల సమన్వయంతో తక్షణమే నిరోధించాలని సూచించింది. సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అనవసర భయాలను తొలగించడానికి అవగాహన కల్పించాలని కోరింది. స్థానిక యంత్రాంగం, సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని సూచించింది. "ఉగ్రవాదంపై నవ భారత్ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుంది" అని బీజేపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.