ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమీక్ష... రేపు అఖిలపక్ష సమావేశం
Add ap7am to your home Screen

ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమీక్ష... రేపు అఖిలపక్ష సమావేశం

Amit Shah Holds Emergency Meeting in Delhi Following Operation Sindoor
  • పహల్గామ్ ఉగ్రదాడికి బదులుతీర్చుకున్న భారత్
  • పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు
  • ఆపరేషన్ సిందూర్ విజయవంతం
  • పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాలతో సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ 
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష చేపట్టారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో  పాల్గొన్నారు. 

రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మే 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశంలో పంచుకోనుంది. 


Advertisement
Amit Shah
Operation Sindoor
Pakistan
India
All-Party Meeting
Delhi
National Security
Border Security
Jammu and Kashmir
Chief Ministers

More Telugu News