16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లను నిషేధించిన భారత్
- భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానళ్లు
- డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ న్యూస్ చానళ్లపై నిషేధం
- వీటన్నింటికీ కలిపి 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు
పహల్గామ్ దాడి తర్వాత ఈ చానళ్లు భారత్‌పై విషం కక్కుతున్నాయని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ లో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీని ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత.. భారతదేశం, దాని సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అలాగే, సున్నితమైన కంటెంట్‌పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.