పహల్గామ్ ఉగ్ర‌దాడి తీవ్రంగా క‌లిచివేస్తోంది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

Pawan Kalyan Condemns Pahalgham Terrorist Attack
షార్ట్స్‌లో చూడండి
పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఈ దాడిలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు సానుభూతి తెలుపుతూ జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంద‌ని తెలిపారు. 

"పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి తీవ్రంగా క‌లిచివేస్తోంది. ఈ దాడిలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా. వారి గౌర‌వార్థం జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. మా పార్టీ జెండాను అవ‌న‌తం చేస్తున్నాం.

ఈ క్లిష్ట స‌మ‌యంలో ఐక్యంగా ఉందాం. మ‌న భార‌త ఐక్య‌త‌ను ఏ ఉగ్ర‌వాదం విచ్ఛిన్నం చేయ‌లేదు. ఇలాంటి దారుణాలు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూడాలి. స‌మష్టిగా మ‌నం దీన్ని అధిగ‌మిద్దాం... క‌లిసిక‌ట్టుగా ఉందాం. ఎప్ప‌టికైనా న్యాయ‌మే గెలుస్తుంది" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో పార్టీ జెండాను అవ‌న‌తం చేశారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Pahalgham Terrorist Attack
Janasena Party
Andhra Pradesh
Telangana
Condolence
India
Terrorism
Deputy CM

More Telugu News