తమ్ముడ్ని చూసి కన్నీటి పర్యంతమైన మంచు లక్ష్మి... వీడియో ఇదిగో!
- ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో గొడవలు
- మోహన్ బాబు, మంచు విష్ణులపై మంచు మనోజ్ పోరాటం
- తాజాగా ఓ కార్యక్రమంలో కలుసుకున్న మంచులక్ష్మి, మనోజ్
- ఇద్దరినీ ఓదార్చిన మౌనిక
ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ కలుసుకున్నారు. చిన్న తమ్ముడ్ని చూడగానే లక్ష్మి కదిలిపోయారు. భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దశలో మంచు మనోజ్ అర్ధాంగి మౌనిక వచ్చి ఆ అక్కాతమ్ముడ్ని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.