ఫిల్మ్ క్లబ్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది: గంటా శ్రీనివాసరావు
- వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందన్న గంటా
- ఫిల్మ్ క్లబ్ లో 15 వందల మంది సభ్యులు ఉన్నారని వెల్లడి
- సినీ పరిశ్రమకు వైజాగ్ సెంటిమెంట్ ప్రాంతమన్న గంటా
ఫిల్మ్ క్లబ్ కు భూమి కేటాయించి భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని గంటా చెప్పారు. వైజాగ్ కు సినీ పరిశ్రమ రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు.
సినీ పరిశ్రమకు వైజాగ్ ఒక సెంటిమెంట్ ప్రాంతమని చెప్పారు. విశాఖకు రావడానికి సినీ పెద్దలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైజాగ్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.