చెన్నై స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ధోనీ పేరెంట్స్... ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ వార్తలు!
- మరోసారి ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై కథనాలు
- ఇవాళ డీసీతో మ్యాచ్ తర్వాత ప్రకటన వచ్చే అవకాశం అంటూ కథనాలు
- ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మహీ తల్లిదండ్రులు
- ఇదే అంశం ఈ వార్తలకు బలం చేకూరుస్తోన్న వైనం
ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఇవాళ్టి మ్యాచ్‌ను ధోనీ తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకి దేవి ప్రత్యక్షంగా వీక్షిస్తుండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇలా మహీ పేరెంట్స్ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి రావడం ఇదే తొలిసారి. దీంతో ఎంఎస్‌డీ అభిమానులతో పాటు క్రికెట్ వర్గాలు కూడా ఈ గేమ్ తర్వాత ధోనీ ఏమైనా ప్రకటన చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.