సికింద్రాబాద్ వస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ
- సంబల్‌పూర్ నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న బాలిక
- కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై నిందితుడి అఘాయిత్యం
- 139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
- రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే నిందితుడి అరెస్ట్
రైలు కేల్తార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక టాయిలెట్‌లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన సంతోష్ కుమార్ కూడా వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఫొటోలు కూడా తీశాడు. తెల్లవారిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే అప్పటికే కాపు కాసిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.