విష్ణుప్రియకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
- బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసు
- తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ పిటిషన్
- ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు
ఈ క్రమంలో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. చట్ట ప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.