ప్రముఖ రచయిత మృతిపై రాజమౌళి భావోద్వేగ పోస్ట్!
- మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూత
- గోపాలకృష్ణన్ మృతిపై 'ఎక్స్' వేదికగా రాజమౌళి సంతాపం
- ఆయన మరణవార్త తీవ్రంగా బాధించిందంటూ ట్వీట్
గోపాలకృష్ణన్ మృతిపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ జక్కన్న ఎమోషనల్ పోస్టు పెట్టారు.
"మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త బాధించింది. ఆయన చిరకాల వాంఛనీయ సాహిత్యం, కవిత్వం, సంభాషణలు ఆయనపై శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లకు ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అని దర్శకధీరుడు ట్వీట్ చేశారు.