అందుకే జనరేటర్ లో పంచదార పోశా: మంచు విష్ణు
- సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన విష్ణు
- జనరేటర్ లో పంచదార ఎందుకు పోశావని ఓ అభిమాని ప్రశ్న
- ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని చదివానన్న విష్ణు
ఓ అభిమాని మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ప్రశ్నించాడు. మాకు కూడా సమాధానం చెప్పేంత మంచి మనసు నీది... అలాంటిది ఆరోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావు అన్నా? అని ప్రశ్నించగా... ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివానని విష్ణు సరదాగా సమాధానం ఇచ్చారు.
తమ ఇంటి వద్ద కరెంట్ సరఫరా నిలిచిపోవడానికి జనరేటర్ లో విష్ణు పంచదార పోశాడని మంచు మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై విష్ణును ఓ అభిమాని ప్రశ్నించాడు.