ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి: బ్రహ్మానందం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి: బ్రహ్మానందం

brahmanandam speech in warangal nit
  • వరంగల్ నిట్‌లో జరిగిన ‘స్ప్రింగ్ స్ప్రీ 2025’  సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొన్న బ్రహ్మానందం 
  • విద్యార్ధులకు మోటివేషన్ క్లాస్ ఇచ్చిన వైనం
  • కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని సూచన
పేదరికం నుంచి వచ్చిన తను, ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరానంటూ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పేర్కొన్నారు. వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నిట్)లో జరిగిన ‘స్ప్రింగ్ స్ప్రీ 2025’ సాంస్కృతిక మహోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన బ్రహ్మానందం విద్యార్ధులకు స్పూర్తిదాయక ప్రసంగం చేశారు. 

విద్యార్ధులు ఎన్ని అటంకాలు ఎదురైనా బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ వంటి మహనీయులను స్పూర్తిగా తీసుకుని జీవితంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకు సాగాలని విద్యార్ధులకు సూచించారు. 

తాను అధ్యాపకుడిగా పనిచేసినప్పటికీ, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచనతో సినిమాల్లో ఒక్కో అడుగు వేస్తూ ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్.. వి షుడ్ హావ్ టు ప్లే అంటూ విద్యార్ధులను ఉత్సాహపరిచారు. మంచి ఆరోగ్యంతో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని బ్రహ్మానందం పేర్కొన్నారు.    

Advertisement
Brahmanandam
Warangal
NIT
Telangana

More Telugu News